తెలుగు



రోజంతా అలిసిపోయి...
అప్పుడే నిద్రాదేవిని పిలుద్దామనుకుంటున్నా..
కనులు మూయగానే,
ఏదో అస్పష్టమైన రూపం కదలాడుతోంది....!!
నా వైపే చూస్తూ...
శూన్యమైన భావాలేవో కదలాడిస్తోంది...
దగ్గరగా పోయి...
ఆసాంతం గమనిస్తున్నా...
లిప్త పాటు కాలం గడవగానే నాకు స్ఫురించింది తెలుగుతల్లి దిగివచ్చిందని...!!!
నన్నే పిలుస్తూ..
అస్పష్టమైన పలుకులేవో పలుకుతోంది....
నన్నయ లేని లోటు తీర్చలేదంటోంది...
శంకరంబాడి వేసిన మల్లెపూదండ వాడిపోయిందని వాపోయింది...
వర్ణమాల వనాలకి తెగులు సోకిందంది...
పొందికైన పదాలన్నింటికి చెదలు పట్టాయంది...!!
చందస్సు, అలంకారాలు ఇత్యాది ఆభరణాలు వాడేవారు లేక తుప్పు పట్టాయంది...!!
అవధానాల ఊసే చెవిన సోకడం లేదంది....
అన్నింటికీ నిందిస్తూ...
వర్ణించరాని వేదనని మూటగట్టుకుంటోంది...
తిరిగి మళ్లీ ఆజ్ఞాపిస్తోంది...
తెలుగు పలికించే ఆనందాన్ని భావి పౌరులకి నేర్పించమని...!!
-అనామిక

Comments

తెలుగుతల్లి ఆవేదన బాగా వర్ణించారండి. "గురజాడ వేసిన మల్లెపూదండ" బదులు "శంకరంబాడి వేసిన మల్లెపూదండ" అంటే సమంజసంగా ఉంటుందేమో ("మా తెలుగుతల్లికి మల్లెపూదండ" గేయ రచయిత శంకరంబాడి సుందరాచార్య. మీ ఉద్దేశ్యం ఈ "మల్లెపూదండ" అనే అనుకుంటున్నాను)??

ఏమనుకోకండి గానీ చక్కటి పేరుండగా "అనామిక" అని వ్రాయడమెందుకండీ? "నా ఇష్టం" అంటారా? అలాక్కానివ్వండి.
vijaya bharathi said…
పొరపాటు జరిగింది.. తప్పకుండా మారుస్తాను. ఇది వరకే ఆ కలం పేరు తో రచన చేయడం తో ఇక్కడ కూడా ఆ పేరు నే కొనసాగించాను. ఇంతకుముందు ఎందుకనో నా పేరు ని బయటకి తేవడం ఇష్టం లేక ఆ పేరు ని పెట్టాను :) ధన్యవాదాలు..

Popular posts from this blog

ప్రేమ

గోరా