Posts

Showing posts with the label ఉచిత సలహాలు

శ్రద్ధ

వసంతమొచ్చినా నీ మనసుకున్న కళంకం పోనట్లు ముహూర్తమేదైనా శ్రద్ధ లేని పని సత్ఫలితలనివ్వదు... -అనామిక

కలహం

కలకాలం కలిసుండాలి కలహించుకోనంతగా..!! కలిసైనా కాలరాయాలి.. కలవనివ్వని కలహాలని... -అనామిక

చిరునవ్వు

Image
ఎవరిదగ్గరా ఏదీ ఊరికే తీసేసుకోమాకండి... కాస్త చిరునవ్వుని బదులిచ్చేయడం అలవాటు చేసుకోండి... -అనామిక 

సలహా

ఊహలే కదా అని గాల్లోకి విసిరేయకండి... పేపరు మీద పెట్టేయండి... మీరేంటో తేలిపోవాలి గా మరి..!! -అనామిక 

రచన

Image
ఏంటో...  ఎప్పుడూ పెన్నూ పేపరూ ముందేసుకుని కూర్చుంటున్నా అని విసుక్కుంటున్నారు మీకేం తెలుసు ఇందులో ఏం ఉందో...!! కోపాన్ని కక్కేయొచ్చు... చిరునవ్వులు పరిచేయొచ్చు... రాని మౌనాన్ని పాటించేయొచ్చు... పక్కనోళ్ల బుర్రలకి కూడా పదును పెట్టేయొచ్చు....!! ప్రయత్నించేయ్యండి మరి మీరు కూడా.. -అనామిక 

పుస్తకం

పిండికొద్దీ రొట్టె లాగా పుస్తకం కొద్దీ జ్ఞానం కూడా.... ఇంకేంటి చూస్తుండ్రు...? పుస్తకాల చదువుడు మీ హాబీల్లోకి చేర్చుండ్రీ.. - అనామిక

మానవత్వం

మడిగుడ్డేసుకుని .. కృష్ణా రామా అంటే... దేవుడు పలుకుతాడో లేదో గానీ... అన్నమో రామచంద్రా అన్నవాడికి పెడితే మాత్రం.. విమానమేసుకుని మరీ ఒచ్చేస్తాడు..!! మొదలెట్టేయండి మరి..!! -అనామిక