Posts

Showing posts from July, 2017

నీ రూపం

అంకెలు మారే తేదీలని చూస్తే.. అదోలాంటి దిగులు... రోజులు గడుస్తున్నా నీ రూపం దరిచేరదేంటని.. -అనామిక 

చిరునవ్వు

ఊహలన్ని కట్టకట్టి రూపమల్లె పురుడు పోసి.. ఊసులన్నీ మోసుకొచ్చి పసిపాపలా పంచుకోనా..!! అల్లరంతా పోగుచేసి చిరునవ్వులాగా మార్చివేసి తుంటరైన వయసుతోటి.. కొంటెగా సడిచేయనా నీ జంటలోనా..!! -అనామిక 

శ్రద్ధ

వసంతమొచ్చినా నీ మనసుకున్న కళంకం పోనట్లు ముహూర్తమేదైనా శ్రద్ధ లేని పని సత్ఫలితలనివ్వదు... -అనామిక

ప్రేమ

కాలం కదిలిపోదు కలకాలం నువు నా జంటైతే... కలం నన్ను వీడిపోదు నీ ఊసులన్నీ నా అక్షరాలవుతుంటే...!! -అనామిక 

కలహం

కలకాలం కలిసుండాలి కలహించుకోనంతగా..!! కలిసైనా కాలరాయాలి.. కలవనివ్వని కలహాలని... -అనామిక

కాలం

అన్నిటికీ కాలమే సమాధానం... గడిచిపోయిన కాలానికి సమాధానమేదంటే మాత్రం మౌనం..!! -అనామిక 
అన్నిటికీ కాలమే సమాధానం... గడిచిపోయిన కాలానికి సమాధానమేదంటే మాత్రం మౌనం..!! -అనామిక 

ఈగో

పదిమందొస్తే... పని పెరుగుతోంది తప్ప.. పంచుకోవాల్సిన ఆనంద క్షణాలు పెరగట్లా..! తలో చెయ్యి వెయ్యాల్సినోళ్లు.. తలో మాట అనేస్తుంటే.. తలదించేసుకోవాల్సొచ్చేస్తుంటే ఎట్లా..!! -అనామిక 

నిజమే గా

ఏం మనుషులో ఏంటో... పొందిగ్గా ఉండమని గొంతేసుకుని అరిచేస్తుంటారు.. మాట మెత్తగా లేదని నోటికొచ్చినంత నిందిచేస్తారు... అవును లే... వాళ్లే మాట్లాడాలి మరి... పొందికత, మెత్తదనం గురించి..!! -అనామిక 

పల్లె

పల్లెల్లో అరమరికలున్న్నయేమో గానీ.. పట్టణాల్లో మాత్రం అరల్లాంటి ఇళ్లూ, మరల్లాంటి మనుషులూ..!!! -అనామిక

గోరా

Image
                                                                    గోరా ! ఈ పేరు వినగానే మగధీర సినిమా లో రావు గారి అబ్బాయి గుర్తొచ్చేయడం పక్కా. ఎందుకంటే మనకి ఇండియన్ సినిమా హిస్టరీ తెలిసినంతగా ఇండియన్ హిస్టరీ తెలీదు కాబట్టి.         ఇండియన్ హిస్టరీ అనగానే చాలా మంది దేశ భక్తులకి రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ డే గుర్తొస్తాయ్, స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేపట్టి ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం తో బ్రిటిషోళ్లని తరిమేసిన గాంధిగారు గుర్తొచ్చేస్తారు.         అందులో ఆశ్చర్యం ఏముంది గానీ, మన చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా దేశాభివృద్ది కోసం పాటు పడిన వాళ్లు ఉంటారు అని చాలా కొద్ది మంది ఆలోచిస్తారు.        అలా పాటు పడిన వాళ్లలో గాంధి గారి కి అత్యంత సన్నిహితులైన వారిలో గోరా గారు కూడా ఒకరు.                నాస్తికత్వం అన్న కొత్త పోకడని సమాజం లో ప్రవేశపెట్టిన మనీషి. ( అని నాకనిపిస్తూ ఉంటుంది)           నిమిషానికొక సారి దేవుడ్ని తలుచుకుంటూ బతికేసే నేను, ఆయన నాస్తికవాదం గురించి ముందు చదవాలనుకోలేదు, కాని ఆయన అసలు ఉద్దేశం ఎంటో తెలుసుకోవాలన్న ఆత్రం కొద్దీ చదవడం మొదలెట్టాను.    "నాస్తికత్

ఆడపిల్ల

Image
చంద్రుడు తన పని తాను చేసుకుంటూ పోతుంటే... ఆరు బయట పిల్లగాలి తోడై నవ్వుతుంటే.... గుమ్మం లో కూర్చుని బుగ్గ మీద చేయి ఆనించి కూర్చునే ఆడపిల్ల కన్నా అందం ఏముంటుందో ఈలోకం లో...!!! కనురెప్పలు కలిసే ఆడిస్తున్నా కలవలేని కలువపూల కనులు ఆనంద ఆశ్చర్యాలతో ముంచెత్తుతున్నా, చిరునవ్వులొలికే అలిసిపోని అధరాలు.. కాదేదీ కవిత్వానికనర్హం అన్నట్లు, అందాన్ని వర్ణించడానికి అక్షరాలు ఏవైతే ఏమిటిలే...!! మది పూల తోటలో పూచే భావాల అక్షరాలన్నీ దండ పేర్చి కవితా దేవత కి అర్పించాలనుకుంటే..... ఎక్కడి నుంచి వచ్చాయో మరి ఊహల మురళీ గానాలు... నన్నే మరిచేలా మైమరిపించేలా...!! అయినా, ఆడపిల్ల ఊహల కన్నా అద్బుత సృష్టి ఏముంటుంది... ఏ మౌని బ్రహ్మకి భూలోకంలో పూజలుండవని శాపమిచ్చాడోగానీ.... కరడుగట్టిన రాళ్లు రప్పలు ఉన్న సృష్టి లో, అమాయకత్వానికి అందాన్ని ఇచ్చి ఆడపిల్లని సృష్టించిన బ్రహ్మ ని మెచ్చుకోక తప్పదు...!!!!!! -అనామిక

లింగ వివక్ష

ఏంటేంటో చెప్తున్నారు... ఓ ప్రాణం పోయడానికి ఆడ మగ కలిసే కావాలిగానీ దేశం అభివృద్ధికి మాత్రం ఆడోళ్లు పనికిరారంట..!!! -అనామిక