పల్లె Get link Facebook X Pinterest Email Other Apps - July 08, 2017 పల్లెల్లో అరమరికలున్న్నయేమో గానీ.. పట్టణాల్లో మాత్రం అరల్లాంటి ఇళ్లూ, మరల్లాంటి మనుషులూ..!!! -అనామిక Get link Facebook X Pinterest Email Other Apps Comments
తెలుగు - June 29, 2017 రోజంతా అలిసిపోయి... అప్పుడే నిద్రాదేవిని పిలుద్దామనుకుంటున్నా.. కనులు మూయగానే, ఏదో అస్పష్టమైన రూపం కదలాడుతోంది....!! నా వైపే చూస్తూ... శూన్యమైన భావాలేవో కదలాడిస్తోంది... దగ్గరగా పోయి... ఆసాంతం గమనిస్తున్నా... లిప్త పాటు కాలం గడవగానే నాకు స్ఫురించింది తెలుగుతల్లి దిగివచ్చిందని...!!! నన్నే పిలుస్తూ.. అస్పష్టమైన పలుకులేవో పలుకుతోంది.... నన్నయ లేని లోటు తీర్చలేదంటోంది... శంకరంబాడి వేసిన మల్లెపూదండ వాడిపోయిందని వాపోయింది... వర్ణమాల వనాలకి తెగులు సోకిందంది... పొందికైన పదాలన్నింటికి చెదలు పట్టాయంది...!! చందస్సు, అలంకారాలు ఇత్యాది ఆభరణాలు వాడేవారు లేక తుప్పు పట్టాయంది...!! అవధానాల ఊసే చెవిన సోకడం లేదంది.... అన్నింటికీ నిందిస్తూ... వర్ణించరాని వేదనని మూటగట్టుకుంటోంది... తిరిగి మళ్లీ ఆజ్ఞాపిస్తోంది... తెలుగు పలికించే ఆనందాన్ని భావి పౌరులకి నేర్పించమని...!! -అనామిక Read more
- May 30, 2019 కొన్ని పాత్రలంతే కాలానికి కళ్లాలేసి మనసుల్ని కదిలిస్తాయ్.. గతపు గదిలోకెళ్ళి చూస్తే కాలమాగిపోయిన గుర్తుల్ని చూపించేస్తాయ్.. మది మౌనమైనప్పుడల్లా స్నేహపు చప్పుళ్లను చేస్తుంటాయ్..! మరపంటూ లేని జ్ఞాపకాల్ని.. మరోసారి గుర్తుచేస్తాయ్..!! నీతో గడిపిన కాలం కొంతే ఐనా.. గతపు పేజీలు నీవే కొన్నైనా..!!! -అనామిక Read more
- January 05, 2018 తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక Read more
Comments