Posts

Showing posts with the label సామాజికత

ఈగో

పదిమందొస్తే... పని పెరుగుతోంది తప్ప.. పంచుకోవాల్సిన ఆనంద క్షణాలు పెరగట్లా..! తలో చెయ్యి వెయ్యాల్సినోళ్లు.. తలో మాట అనేస్తుంటే.. తలదించేసుకోవాల్సొచ్చేస్తుంటే ఎట్లా..!! -అనామిక 

భారత్

జీన్స్ లో స్టైలు నచ్చలేదు ఇంకోటి కావాలంటుందో పిల్ల... అసలు బట్టలు దొరికితే చాలంటుంది అదే ఈడు పిల్ల... పిజ్జా బాలేదని వంక పెడుతుంటె ఓ వైపు... పచ్చడి మెతుకులైనా దొరకక పోతాయా అని ఎదురుచూపులు ఇంకోవైపు... విభిన్న మతాల సెక్యులర్ భారతం సంగతి ఏమో గానీ.... ఇన్ని భిన్న వర్గాలు మాత్రం మన భారత్ లోనే ఎక్కువ... -అనామిక

వృధా

కొందరంతే... కష్టపడి చెమటోడ్చేస్తుంటారు... సముద్రం లో కల్లుప్పు కలపడానికి... -అనామిక