Posts

Image
కొన్ని పాత్రలంతే కాలానికి కళ్లాలేసి మనసుల్ని కదిలిస్తాయ్.. గతపు గదిలోకెళ్ళి చూస్తే కాలమాగిపోయిన గుర్తుల్ని చూపించేస్తాయ్.. మది మౌనమైనప్పుడల్లా స్నేహపు చప్పుళ్లను చేస్తుంటాయ్..! మరపంటూ లేని జ్ఞాపకాల్ని.. మరోసారి గుర్తుచేస్తాయ్..!! నీతో గడిపిన కాలం కొంతే ఐనా.. గతపు పేజీలు నీవే కొన్నైనా..!!! -అనామిక
తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక
ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక

మనిషి

మనిషంటే అంతే... తనదికాని ప్రపంచం లో బతుకుతూ... తన లోపలి ప్రపంచాన్ని బతికించుకుంటూ..!! అనామిక
ఆరిపోయిన దీపాన్నే గా అనుకున్నా... కరిగిపోయిన మైనం తిరిగి వెలిగేదాకా.. చెదిరిపోయిన స్వప్నాన్ని చేరేదాకా..!! -అనామిక
తనడిగింది.... నిశీధికంత నిశితమేంటని... పగలు నేర్చిన పాఠాలన్నీ.. రాత్రయ్యాక నిద్రపుచ్చని జోలపాటలయ్యాయేంటని... మరిక బదులేంచెప్పాలీ.. తప్పేమో అన్న ప్రశ్న కి అనుభవమే సమాధానమయ్యాక..!! -అనామిక
You cant scrolling this without like, 1/- for one like.. Type amen to save child... లాంటి పోస్ట్ ల వెనక క్యు కట్టే వాడు కూడా.. జనగణమన కి నుంచుంటేనే దేశభక్తా అని అడుగుతాడు... లైకులకి కామెంట్లకి బతికేసే ప్రాణాలున్నపుడు... నుంచుంటే మురిసిపోయే దేశమాత ఉండదా అని అడగాలనిపిస్తుంది.. _అనామిక