గోరా ! ఈ పేరు వినగానే మగధీర సినిమా లో రావు గారి అబ్బాయి గుర్తొచ్చేయడం పక్కా. ఎందుకంటే మనకి ఇండియన్ సినిమా హిస్టరీ తెలిసినంతగా ఇండియన్ హిస్టరీ తెలీదు కాబట్టి. ఇండియన్ హిస్టరీ అనగానే చాలా మంది దేశ భక్తులకి రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ డే గుర్తొస్తాయ్, స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేపట్టి ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం తో బ్రిటిషోళ్లని తరిమేసిన గాంధిగారు గుర్తొచ్చేస్తారు. అందులో ఆశ్చర్యం ఏముంది గానీ, మన చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా దేశాభివృద్ది కోసం పాటు పడిన వాళ్లు ఉంటారు అని చాలా కొద్ది మంది ఆలోచిస్తారు. అలా పాటు పడిన వాళ్లలో గాంధి గారి కి అత్యంత సన్నిహితులైన వారిలో గోరా గారు కూడా ఒకరు. నాస్తికత్వం అన్న కొత...
Comments