తనో ఏకాంత దేవేరి...
అతనో నిశ్శబ్ధ సంహారి...
వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!!
-అనామిక
తెలుగు
రోజంతా అలిసిపోయి... అప్పుడే నిద్రాదేవిని పిలుద్దామనుకుంటున్నా.. కనులు మూయగానే, ఏదో అస్పష్టమైన రూపం కదలాడుతోంది....!! నా వైపే చూస్తూ... శూన్యమైన భావాలేవో కదలాడిస్తోంది... దగ్గరగా పోయి... ఆసాంతం గమనిస్తున్నా... లిప్త పాటు కాలం గడవగానే నాకు స్ఫురించింది తెలుగుతల్లి దిగివచ్చిందని...!!! నన్నే పిలుస్తూ.. అస్పష్టమైన పలుకులేవో పలుకుతోంది.... నన్నయ లేని లోటు తీర్చలేదంటోంది... శంకరంబాడి వేసిన మల్లెపూదండ వాడిపోయిందని వాపోయింది... వర్ణమాల వనాలకి తెగులు సోకిందంది... పొందికైన పదాలన్నింటికి చెదలు పట్టాయంది...!! చందస్సు, అలంకారాలు ఇత్యాది ఆభరణాలు వాడేవారు లేక తుప్పు పట్టాయంది...!! అవధానాల ఊసే చెవిన సోకడం లేదంది.... అన్నింటికీ నిందిస్తూ... వర్ణించరాని వేదనని మూటగట్టుకుంటోంది... తిరిగి మళ్లీ ఆజ్ఞాపిస్తోంది... తెలుగు పలికించే ఆనందాన్ని భావి పౌరులకి నేర్పించమని...!! -అనామిక
Comments
అతనో దబిడి దిబిడి.
బురదలా పొంగిన తవికే ఒక బుచికేరి.
-కుక్షిలో కుచికుచి