Posts

Showing posts with the label చిలిపి సెటైర్
You cant scrolling this without like, 1/- for one like.. Type amen to save child... లాంటి పోస్ట్ ల వెనక క్యు కట్టే వాడు కూడా.. జనగణమన కి నుంచుంటేనే దేశభక్తా అని అడుగుతాడు... లైకులకి కామెంట్లకి బతికేసే ప్రాణాలున్నపుడు... నుంచుంటే మురిసిపోయే దేశమాత ఉండదా అని అడగాలనిపిస్తుంది.. _అనామిక

కాలం

అన్నిటికీ కాలమే సమాధానం... గడిచిపోయిన కాలానికి సమాధానమేదంటే మాత్రం మౌనం..!! -అనామిక 

నిజమే గా

ఏం మనుషులో ఏంటో... పొందిగ్గా ఉండమని గొంతేసుకుని అరిచేస్తుంటారు.. మాట మెత్తగా లేదని నోటికొచ్చినంత నిందిచేస్తారు... అవును లే... వాళ్లే మాట్లాడాలి మరి... పొందికత, మెత్తదనం గురించి..!! -అనామిక 

పల్లె

పల్లెల్లో అరమరికలున్న్నయేమో గానీ.. పట్టణాల్లో మాత్రం అరల్లాంటి ఇళ్లూ, మరల్లాంటి మనుషులూ..!!! -అనామిక

కామన్ సెన్స్

లాజిక్ ,మాజిక్ సంగతి తర్వాత ముందు కామన్ సెన్స్ వాడండి....😊😊

సరదాకి

మోడ్రన్ కోడలు అత్తారింటికెళ్తే.. చీకు చింతా లేకుండా గడపండమ్మా అని ఆశీర్వదించిందిట ఆ పెద్దావిడ.. తెలుగే తెలీని మన తెలుగింటి కోడలు చింత లేకుండా సాంబారే రాదు... కాపురమెట్లా చేసేదత్తయ్యా అందిట..!! -అనామిక 

ప్రేమ

Image
పట్టుమని పదారేళ్లైనా లేకుండా ప్రపంచం లోని దిగులంతా ముందేసుకుని కూర్చుందిట ఆ పిల్ల... ఏంటమ్మా ? అని వాళ్లమ్మ అడిగితే.. ప్రేమ గురించి నీకు తెలీదులేమ్మా అని నిష్ఠూరమాడిందిట...! ఇదేం విడ్డూరమోనమ్మా మరి...!! -అనామిక

గాల్లో ప్రేమ

గాల్లో ప్రేమ ఉంటుందంటారు... గాలే కనపడదు.. మళ్లీ అందులో ప్రేమని వెతకాలా.. -అనామిక

అనుబంధం

Image
ఎన్ని బంధాలిచ్చావ్ దేవుడా.. అనుబంధం పెట్టడం మాత్రం మర్చిపోయావ్..!! -అనామిక

ప్రేమ

వెనకటికి, ఒకావిడ ఉట్టికెగరలేకపోయినా ఆకాశానికెగురుతానందిట...! అట్లానే ఉన్నారు కొందరమ్మాయిలు... ప్రేమించడం చేత కాదుగానీ... వాళ్లని సరిగ్గా ప్రేమించడం లేదని చాడీల నుంచి బ్రేకప్పుల దాకా వెళ్లిపోతున్నారు....!! -అనామిక

బంధం

ఇదిగోండమ్మాయిలూ.... అందం..అందం...అని కాదు... బంధం..బంధం..అని పట్టుకువేళ్లాడండి... సగం కుటుంబాలు బాగుంటాయి... -అనామిక

రాజకీయం

కొన్ని రాజకీయాలింతే.. ఉల్లిపొర తీసినట్లే ఉంటాయి... మ్యాటర్ మాత్రం నిల్లు..!! -అనామిక

జెండర్

వాళ్లంతే.. ఆడ మగ అని ఎక్కువ తక్కువ చూపించేస్తారు... అమ్మాయిల కొలతలు మాత్రం లెక్క సరిగా ఉండాలంటారు... -అనామిక

సెక్యులర్

సెక్యులర్ సెక్యులర్ అంటూ సెగలు కక్కేస్తుంటారు...  సెక్సువాలిటీ మీద ఉన్నంత అవగాహన మతాన్ని గౌరవించడం మీద ఉండదు.. -అనామిక

కాలం

తనని తాను గొప్పోడ్ననుకునే వీరుడొకడు ... చిన్న సమస్య రాగానే... కాలం కాలం సమాధానమేదీ అన్నాడట... కాలం మాత్రం.. నీ కాళ్లకి నేర్పిన పరుగునడుగు అన్నదట... - అనామిక