Posts

Showing posts from June, 2017

కామన్ సెన్స్

లాజిక్ ,మాజిక్ సంగతి తర్వాత ముందు కామన్ సెన్స్ వాడండి....😊😊

సరదాకి

మోడ్రన్ కోడలు అత్తారింటికెళ్తే.. చీకు చింతా లేకుండా గడపండమ్మా అని ఆశీర్వదించిందిట ఆ పెద్దావిడ.. తెలుగే తెలీని మన తెలుగింటి కోడలు చింత లేకుండా సాంబారే రాదు... కాపురమెట్లా చేసేదత్తయ్యా అందిట..!! -అనామిక 

చిరునవ్వు

Image
ఎవరిదగ్గరా ఏదీ ఊరికే తీసేసుకోమాకండి... కాస్త చిరునవ్వుని బదులిచ్చేయడం అలవాటు చేసుకోండి... -అనామిక 

సలహా

ఊహలే కదా అని గాల్లోకి విసిరేయకండి... పేపరు మీద పెట్టేయండి... మీరేంటో తేలిపోవాలి గా మరి..!! -అనామిక 

ప్రేమ

Image
పట్టుమని పదారేళ్లైనా లేకుండా ప్రపంచం లోని దిగులంతా ముందేసుకుని కూర్చుందిట ఆ పిల్ల... ఏంటమ్మా ? అని వాళ్లమ్మ అడిగితే.. ప్రేమ గురించి నీకు తెలీదులేమ్మా అని నిష్ఠూరమాడిందిట...! ఇదేం విడ్డూరమోనమ్మా మరి...!! -అనామిక

గాల్లో ప్రేమ

గాల్లో ప్రేమ ఉంటుందంటారు... గాలే కనపడదు.. మళ్లీ అందులో ప్రేమని వెతకాలా.. -అనామిక

ఆకాశం

Image
కొంతమంది కవులుంటారూ.... ఎప్పుడూ చందమామ ని పట్టుకుని వేళ్లాడుతుంటారు... చుక్కలేం పాపం చేసాయో.. అందాలన్నీ ఆరబోసినా ఆకాశాన్ని కన్నేత్తి అయినా చూడరు... -అనామిక

రచన

Image
ఏంటో...  ఎప్పుడూ పెన్నూ పేపరూ ముందేసుకుని కూర్చుంటున్నా అని విసుక్కుంటున్నారు మీకేం తెలుసు ఇందులో ఏం ఉందో...!! కోపాన్ని కక్కేయొచ్చు... చిరునవ్వులు పరిచేయొచ్చు... రాని మౌనాన్ని పాటించేయొచ్చు... పక్కనోళ్ల బుర్రలకి కూడా పదును పెట్టేయొచ్చు....!! ప్రయత్నించేయ్యండి మరి మీరు కూడా.. -అనామిక 

అనుబంధం

Image
ఎన్ని బంధాలిచ్చావ్ దేవుడా.. అనుబంధం పెట్టడం మాత్రం మర్చిపోయావ్..!! -అనామిక

ప్రేమ

వెనకటికి, ఒకావిడ ఉట్టికెగరలేకపోయినా ఆకాశానికెగురుతానందిట...! అట్లానే ఉన్నారు కొందరమ్మాయిలు... ప్రేమించడం చేత కాదుగానీ... వాళ్లని సరిగ్గా ప్రేమించడం లేదని చాడీల నుంచి బ్రేకప్పుల దాకా వెళ్లిపోతున్నారు....!! -అనామిక

భారత్

జీన్స్ లో స్టైలు నచ్చలేదు ఇంకోటి కావాలంటుందో పిల్ల... అసలు బట్టలు దొరికితే చాలంటుంది అదే ఈడు పిల్ల... పిజ్జా బాలేదని వంక పెడుతుంటె ఓ వైపు... పచ్చడి మెతుకులైనా దొరకక పోతాయా అని ఎదురుచూపులు ఇంకోవైపు... విభిన్న మతాల సెక్యులర్ భారతం సంగతి ఏమో గానీ.... ఇన్ని భిన్న వర్గాలు మాత్రం మన భారత్ లోనే ఎక్కువ... -అనామిక

బంధం

ఇదిగోండమ్మాయిలూ.... అందం..అందం...అని కాదు... బంధం..బంధం..అని పట్టుకువేళ్లాడండి... సగం కుటుంబాలు బాగుంటాయి... -అనామిక

పుస్తకం

పిండికొద్దీ రొట్టె లాగా పుస్తకం కొద్దీ జ్ఞానం కూడా.... ఇంకేంటి చూస్తుండ్రు...? పుస్తకాల చదువుడు మీ హాబీల్లోకి చేర్చుండ్రీ.. - అనామిక

రాజకీయం

కొన్ని రాజకీయాలింతే.. ఉల్లిపొర తీసినట్లే ఉంటాయి... మ్యాటర్ మాత్రం నిల్లు..!! -అనామిక

జెండర్

వాళ్లంతే.. ఆడ మగ అని ఎక్కువ తక్కువ చూపించేస్తారు... అమ్మాయిల కొలతలు మాత్రం లెక్క సరిగా ఉండాలంటారు... -అనామిక

తిండి

అదేం అలవాటో కొంతమందికి.. మామిడికాయని కూడా స్టైలు గా తింటుంటారు... ఎవరేమి అనుకుంటే ఏం లే... చీక్కోడం లోని మజానే వేరు.. -అనామిక

రచన

ఇందులో అన్నీ నా ఇష్టాలేనండోయ్... అయినా సరే చదువుతాం అంటే.. మీ ఇష్టం మరి... -అనామిక

మానవత్వం

మడిగుడ్డేసుకుని .. కృష్ణా రామా అంటే... దేవుడు పలుకుతాడో లేదో గానీ... అన్నమో రామచంద్రా అన్నవాడికి పెడితే మాత్రం.. విమానమేసుకుని మరీ ఒచ్చేస్తాడు..!! మొదలెట్టేయండి మరి..!! -అనామిక

వృధా

కొందరంతే... కష్టపడి చెమటోడ్చేస్తుంటారు... సముద్రం లో కల్లుప్పు కలపడానికి... -అనామిక

సెక్యులర్

సెక్యులర్ సెక్యులర్ అంటూ సెగలు కక్కేస్తుంటారు...  సెక్సువాలిటీ మీద ఉన్నంత అవగాహన మతాన్ని గౌరవించడం మీద ఉండదు.. -అనామిక

కాలం

తనని తాను గొప్పోడ్ననుకునే వీరుడొకడు ... చిన్న సమస్య రాగానే... కాలం కాలం సమాధానమేదీ అన్నాడట... కాలం మాత్రం.. నీ కాళ్లకి నేర్పిన పరుగునడుగు అన్నదట... - అనామిక

తెలుగు

రోజంతా అలిసిపోయి... అప్పుడే నిద్రాదేవిని పిలుద్దామనుకుంటున్నా.. కనులు మూయగానే, ఏదో అస్పష్టమైన రూపం కదలాడుతోంది....!! నా వైపే చూస్తూ... శూన్యమైన భావాలేవో కదలాడిస్తోంది... దగ్గరగా పోయి... ఆసాంతం గమనిస్తున్నా... లిప్త పాటు కాలం గడవగానే నాకు స్ఫురించింది తెలుగుతల్లి దిగివచ్చిందని...!!! నన్నే పిలుస్తూ.. అస్పష్టమైన పలుకులేవో పలుకుతోంది.... నన్నయ లేని లోటు తీర్చలేదంటోంది... శంకరంబాడి వేసిన మల్లెపూదండ వాడిపోయిందని వాపోయింది... వర్ణమాల వనాలకి తెగులు సోకిందంది... పొందికైన పదాలన్నింటికి చెదలు పట్టాయంది...!! చందస్సు, అలంకారాలు ఇత్యాది ఆభరణాలు వాడేవారు లేక తుప్పు పట్టాయంది...!! అవధానాల ఊసే చెవిన సోకడం లేదంది.... అన్నింటికీ నిందిస్తూ... వర్ణించరాని వేదనని మూటగట్టుకుంటోంది... తిరిగి మళ్లీ ఆజ్ఞాపిస్తోంది... తెలుగు పలికించే ఆనందాన్ని భావి పౌరులకి నేర్పించమని...!! -అనామిక