Posts

Showing posts from August, 2017
ఆశలన్నీ గుర్తొస్తున్నాయి.. అడియాసలయ్యాక... జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి.. బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక.. -అనామిక 
Image
ఏంటో నువ్వు.. విరిగిపోయిన ఆకాశాన్ని మబ్బులతో కప్పిపుచ్చాలనుకుంటావు.. చెదరిపోయిన మనసుని మాటల దారాలేసి కట్టెయ్యాలనుకుంటావు.. దగ్గరైన భూమ్యాకాశాలంత అద్భుతాలవి.. కాని ఎప్పటికీ దరికి చేరని వాస్తవాలవి.. -అనామిక

ఆశ

చావే లేని ఆశ.. చంపడానికొచ్చిన నిరాశని చంపేస్తుంది..!! సూర్యోదయానికి నిలువెత్తు ప్రతిరూపం ఆశ.. ఎన్ని అస్తమయాలొచ్చినా అలుపే రాని శ్వాస..!! మనసు గదికి సంకెళ్లు లేని బందీ ఆశ.. నిరంతరం ధైర్యాన్ని తోడిపోసే వృత్తి లో జీవిత ఖైదు..!! ఊపిరాగేదాకా ఊసుపోనిది ఆశకొక్కదానికే.. ఊడిపడ్డప్పుడల్లా ఊరడించి ఊపందిస్తుంది....!! ఆశలన్ని కట్ట కట్టుకుని ఆశయాలైపోయాయి.. ఆవిరైపోయిన జీవితాల్లో వెలుగు నింపాలని..!! ప్రతి కలానికీ ఓ ఆశ.. తన యజమాని ఊహలన్నిటికీ పురుడు పోయాలని..!! -అనామిక

స్నేహం

స్నేహం లేని ప్రేమ మొదలవుతుందేమో గానీ.. ప్రేమ లేని స్నేహం మాత్రం ఉండదు.. దేన్నైనా మనసుతో పంచుకునే ఇద్దరు వ్యక్తుల బంధం స్నేహం.. మనసునే పంచుకునే రెండు ఆత్మల అపురూప కావ్యం ప్రేమ..!! -అనామిక 
ఏదైనా కోరుకో... ఏమైనా శాసించుకో.. ప్రేమని తప్ప.. అది కలగాలే తప్ప.. కలిగించబడకూడదు.! -అనామిక 
రణం ఎప్పటికైనా శరణం అంటూ ముగుస్తుంది.. అణచివేత ఎప్పటికైన రణాన్నే శరణంటుంది.. -అనామిక 
ఏ నిశిరాతిరి శబ్దానివో.. గుండె లయ కి శృతి కలుపుతుంటావు.. ఏ స్మృతి గీత మౌనానివో.. మదికో కొత్త భాష నేర్పిస్తుంటావు.. ఏ పరుష భావాధిపతివో.. దరి చేరలేక దూరం చేస్తుంటావు..!! -అనామిక 
ఆశలన్నీ గుర్తొస్తున్నాయి.. అడియాసలయ్యాక... జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి.. బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక.. -అనామిక