ఆశ

చావే లేని ఆశ..
చంపడానికొచ్చిన నిరాశని చంపేస్తుంది..!!

సూర్యోదయానికి నిలువెత్తు ప్రతిరూపం ఆశ..
ఎన్ని అస్తమయాలొచ్చినా అలుపే రాని శ్వాస..!!

మనసు గదికి సంకెళ్లు లేని బందీ ఆశ..
నిరంతరం ధైర్యాన్ని తోడిపోసే వృత్తి లో జీవిత ఖైదు..!!

ఊపిరాగేదాకా ఊసుపోనిది ఆశకొక్కదానికే..
ఊడిపడ్డప్పుడల్లా ఊరడించి ఊపందిస్తుంది....!!

ఆశలన్ని కట్ట కట్టుకుని ఆశయాలైపోయాయి..
ఆవిరైపోయిన జీవితాల్లో వెలుగు నింపాలని..!!

ప్రతి కలానికీ ఓ ఆశ..
తన యజమాని ఊహలన్నిటికీ పురుడు పోయాలని..!!

-అనామిక

Comments

Popular posts from this blog

ప్రేమ

గోరా

తెలుగు