గోరా

                                                                    గోరా !

ఈ పేరు వినగానే మగధీర సినిమా లో రావు గారి అబ్బాయి గుర్తొచ్చేయడం పక్కా.

ఎందుకంటే మనకి ఇండియన్ సినిమా హిస్టరీ తెలిసినంతగా ఇండియన్ హిస్టరీ తెలీదు కాబట్టి.
        ఇండియన్ హిస్టరీ అనగానే చాలా మంది దేశ భక్తులకి రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ డే గుర్తొస్తాయ్, స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేపట్టి ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం తో బ్రిటిషోళ్లని తరిమేసిన గాంధిగారు గుర్తొచ్చేస్తారు.
        అందులో ఆశ్చర్యం ఏముంది గానీ, మన చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా దేశాభివృద్ది కోసం పాటు పడిన వాళ్లు ఉంటారు అని చాలా కొద్ది మంది ఆలోచిస్తారు.

       అలా పాటు పడిన వాళ్లలో గాంధి గారి కి అత్యంత సన్నిహితులైన వారిలో గోరా గారు కూడా ఒకరు.
       
       నాస్తికత్వం అన్న కొత్త పోకడని సమాజం లో ప్రవేశపెట్టిన మనీషి. ( అని నాకనిపిస్తూ ఉంటుంది)
   
      నిమిషానికొక సారి దేవుడ్ని తలుచుకుంటూ బతికేసే నేను, ఆయన నాస్తికవాదం గురించి ముందు చదవాలనుకోలేదు, కాని ఆయన అసలు ఉద్దేశం ఎంటో తెలుసుకోవాలన్న ఆత్రం కొద్దీ చదవడం మొదలెట్టాను.

   "నాస్తికత్వం అంటే దేవుడ్ని వ్యతిరేకించడం కాదు, కేవలం హేతువాద ధోరణి లో ఆలోచిస్తూ, మూఢ నమ్మకాలనుంచీ విముక్తులవుతూ మానవత్వం తో బ్రతకడం." అప్రయత్నం గా దొరికిన సరస్వతీ గోరా (గోరా గారి భార్య) గారి ఆత్మకధ పుస్తకం నుంచీ నేను నేర్చుకున విషయం ఇదే.

           స్వంత గ్రామమైన కాకినాడ నుంచీ, సనాతన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి, ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, తనలాంటి సర్వ నిష్ట సంప్రదాయాలున్న కుటుంబం నుంచీ వచ్చిన సరస్వతి ని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్న గోరా దంపతులు మతపరమైన నమ్మ కాలు నాగరిక జీవనాన్ని దేశ అభ్యున్నతి ని ఆటంకం కలిగించరాదు అన్న ఆలోచనతో మాత్రమే నాస్తిక మార్గం లో నడిచారు. (ఎవరి నమ్మకాలనూ ఆస్తిక వాద సిద్ధాంతాలను కించ పరచాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు.)

           ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ఇద్దరు వ్యక్తులు వారి స్వంత వ్యక్తిత్వాల కోసం, అభిప్రాయాలని ప్రకటించుకోవడం కోసం సంప్రదాయా లని త్యజించడం అనేది ఆరోజుల్లో మాములు విషయం కాదు.
 
           బంధువులు కుటుంబ సభ్యుల వ్యతిరేకతల నడుమ వారిద్దరూ తమ నమ్మకాలపై నిలబడ్డారు. అంతే కాకుండా, నాస్తికవాద ప్రచారం తో పాటు వారితో కలిసి నడిచిన సంఘ సభ్యులు, కార్యకర్తలు, మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలని చైతన్య పరుస్తూ వారందరినీ స్వాతంత్ర పోరాట సమరం లో భాగస్వామ్యులని చేసారు.

          ఆరోజుల్లోనే, వారిద్దరి మధ్య నమ్మక బలానికి, సూచనలకి వేల మంది ప్రజలు దాసోహమన్నారు, వారి బాటలో నే నడిచారు.

          గర్భవతి గా ఉండి గ్రహణం చూస్తే మొర్రి వస్తుందనే (?) మూఢ నమ్మకాన్ని సరస్వతి గోరా స్వయం గా పరిశోధన చేసి ( ఆవిడ గర్భవతి గా ఉన్నపుడు రెండుసార్లు గ్రహణాన్ని చూసారు) అసత్యమని నిరూపణ చేసారు. అంతేకాక మారుమూల గ్రామాల మహిళల్లో కూడా ఆచరింపచేసారు. అందరి పిల్లలూ ఆరోగ్యం గా జన్మించగలగడం అనేది ఆనందించదగ్గ విషయం.

         ఉప్పుసత్యాగ్రహం ఉద్యమ సమయం లో పుట్టిన బిడ్డ కి లవణం అనీ, దేశాల మధ్య రాజీ సమయం లో పుట్టిన బిడ్డకి మైత్రి అనీ, ఇలా సమయానుసారం గా విద్య అనీ, విజయం అనీ,సమరం , మారు, నౌ ఇలా పేర్లు పెట్టుకుని ఆదర్శం గా నిలిచారు.

          ఉద్యోగ రీత్యా కొలొంబో లో కొంతకాలం ఉండాల్సి రావడం వల్ల, విభిన్న మత, జాతి, వ్యక్తిత్వాల మనుషుల మధ్య గడపడం వల్లనూ ఇటువంటి తార్కికా ఆలోచనా విధానం అలవడి జీవితాన్ని నాస్తికవాద దృష్టి తో చూడాలనే లక్ష్యం ఏర్పడినట్లు నాకనిపిస్తూ ఉంటుంది.

          గోరా దంపతులు, ముదునూరు లో నాస్తికవాద ప్రచారం తో వారి జీవితాన్ని ప్రారంభించినా, క్రమం గా గాంధీజీ తో స్నేహం తరవాత వారి భావాలని త్యజించకుండానే, దేశ స్వాతంత్రం కోసం పోరాడటం, కటకటాల పాలైనా ఆత్మస్థైర్యాన్ని విడనాడకుండా సాటి జనాలకు తార్కిక ధోరణి నేర్పిస్తూ కొత్త చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ( అందరికీ గోరా గారి గురించి తెలియక పోవడం దురదృష్టకరం.) వారు విజయవాడ లో పటమట లంక లో నివసించడం మొదలుపెట్టాక ఎక్కువ ఉద్యమాలు చేసారని నాకనిపిస్తుంది.

          గోరా గారి భార్య, సరస్వతి గోరా.. బ్రాహ్మణ కుటుంబం నుంచీ వచ్చీ చిన్నప్పటి నుంచీ దైవచింతనే లక్ష్యం గా తల్లి తో కలిసి పూజలు చేస్తూ ఉండేది. గోరా గారిని వివాహం చేసుకున్నాక ఆయనతో పాటు ఆధునిక భావాలని పుణికి పుచ్చుకుంది. అయినప్పటికీ, ఎంతటి వ్యక్తిత్వాన్ని పెంపొదించుకున్నా ఏనాడూ అత్తమామలని, తల్లి తండ్రులని, వ్యతిరేకించలేదు.

          ఆధునికత అంటే వ్యక్తిగా ఎదగాలి గానీ స్వార్ధం గా బతికి తెలివితేటల్ని చూపడం కాదని తన జీవితం ద్వారా చూపించింది. ఈనాటి అమ్మాయిలు నేర్చుకోవాల్సిన విషయం ఇది.

          దేశ స్వాతంత్రం కోసం గోరాగారికి ఏమాత్రం తీసిపోకుండా పోరాడి, జైలు జీవితాన్ని కూడా చవిచూసి అందులోనూ తృప్తి ని వెతుక్కుంది. ఎనిమిది మంది సంతానాన్ని స్వాతంత్ర సమర యోధులు గా తీర్చిదిద్దింది.

          వారు కూడా సమాజానికి తమవంతు సహాయం చేయలన్న తపన కలిగినవారు.

          వారి సంతానంచే నడుప బడుచున్న వాసవ్య మహిళా మండలి, ఆర్ధిక సమతా మండలి, గోరా సైన్సు ఎగ్జిబిషను వంటి కార్యక్రమాలు నేటికీ విజయవాడ లోని పటమట లంకలో కొనసాగించబడుచున్నవి.

          వాసవ్య మహిళా మండలి( వా అంటే వాస్తవికత, స అంటే సంఘ సేవ, వ్య అంటే వ్యక్తిత్వం ) ఎందరో మహిళలకి ఆసరా. ఆర్ధిక మహిళా మండలిని గోరా దంపతులు చివరి సంతానం నౌ గారు నడుపుతున్నారు. ప్రతీ సంవత్సరం ఎందరో ఆడపిల్లల కి చదువు నిమిత్తం స్కాలర్షిప్ అందిస్తున్నారు.

         అందులో నేనుకూడా ఉన్నాను. అసలు వాళ్ల గురించి మొదటిసారి అప్పుడే విన్నాను. తెలుసుకోవాలన్న తపన కొద్దీ ఆవిడ ఆత్మకధని చదివాను. అన్ని విషయాలు వివరించలేకపోయినా నాకు తోచిన రీతిలో గోరా గారి గురించి చెప్పే ప్రయత్నం చేసాను.


గమనిక: పూర్తిగా వ్యక్తిగతం గా నాస్తికవాదాన్ని నేను కూడా ఆచరించలేను. నాస్తికవాదం గట్టి నమ్మకం ఉన్నవారి విషయం లో మాత్రమే నిజమవుతుందని నమ్ముతున్నాను.

ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మనసులో గ్రహణం చూస్తే మొర్రి వస్తుంది అన్న నమ్మకం ఉండి, పైకి నాస్తికవాదాన్ని ఆచరించాలని గ్రహణాన్ని చూస్తే ఎవరు మాత్రం గ్యారంటీ ఇవ్వగలరు.


అందుకే నమ్మకమే జీవితం... అది ఆస్తికవాదమైనా...నాస్తికవాదమైనా....!!
-అనామిక

గోరా దంపతులు


          

Comments

Unknown said…
Bharata desaniki swatantryam ravadaniki gandhi garo.. nehru garo matrame karanam anukovadam porapati.. desam nalumulala nundi ento mandi valla jeevitalani dharaposaru.. alanti varilo "Gora"(Goparaju Ramachandra Rao ) garu okaru.. appatlo samajamlo unde enno mudha nammakalanu pogottadamlo Gora garu , ayana bharya saraaswati gari patra viseshamainadi. Desamlo jarugutunna vividha paristitulaku gurtu ga ayana vari pillalaku aaya paristitulaku tagga perlanu pettadam chala goppa vishayam..

talli tandrulu enta goppavarainappatiki vari aasayalanu , alochanalanu adarsamga , badyataga sweekarinchevallani chala takkuva mandini chustuntam.. alantidi vari tommidi mandi santanam samajam lo ento goppa sthai lo unnavarainappatiki vari vrutti dharmanni , saamajika dharmanni samanam ga paatinchadam vari talli tandrula paina, desam paina vallaki unna bhakti ni teliyajestundi.. hatsoff

kalam to patu manushulu alochanalu kuda marali... enati yuvata saamskrutikamga , sanketikam ga kuda munduku sagalane asayamto sthapinchina "Gora Science Scentre" , desam lo eenatiki patukupoi unna
mahila pakshapatanni pogottadaniki , adapillalaki mano dhairyani penchagaligedi chaduvu matrame ani ento mandi adapillalaki chaduvukune avakasanni kalpistunna "AArdhika samata mandali" (nenu kuda vari sahayamto chaduvukovadam chala santoshakaram ) , Mahilalalaku enno vishaluga upadhi kalpistunna "vasavya mahila mandali" veeti gurinchi enta cheppina takkuve..

@vijayaBharathi , Gora gari gurinchi chala baga cheppavu.. ilage mari konta mandi goppavari gurinchi neti taraniki telijeyali ani korukuntunnanu :)
Vijaya bharathi said…
Sure dear i will always put my pen towards this society

Popular posts from this blog

ప్రేమ