Posts

Image
కొన్ని పాత్రలంతే కాలానికి కళ్లాలేసి మనసుల్ని కదిలిస్తాయ్.. గతపు గదిలోకెళ్ళి చూస్తే కాలమాగిపోయిన గుర్తుల్ని చూపించేస్తాయ్.. మది మౌనమైనప్పుడల్లా స్నేహపు చప్పుళ్లను చేస్తుంటాయ్..! మరపంటూ లేని జ్ఞాపకాల్ని.. మరోసారి గుర్తుచేస్తాయ్..!! నీతో గడిపిన కాలం కొంతే ఐనా.. గతపు పేజీలు నీవే కొన్నైనా..!!! -అనామిక
తనో ఏకాంత దేవేరి... అతనో నిశ్శబ్ధ సంహారి... వరదలా పొంగిన ప్రేమే ఓ కావేరి..!! -అనామిక
ఆ కళ్లేదో మాయ చేసాయ్... కలలో కనిపించి మాయమైపోయిన అద్భుతం లా... కళ్ల ముందే తచ్చాడుతుంటాయ్... కనుచూపుమేరంతా శూన్యమైనా..! -అనామిక

మనిషి

మనిషంటే అంతే... తనదికాని ప్రపంచం లో బతుకుతూ... తన లోపలి ప్రపంచాన్ని బతికించుకుంటూ..!! అనామిక
ఆరిపోయిన దీపాన్నే గా అనుకున్నా... కరిగిపోయిన మైనం తిరిగి వెలిగేదాకా.. చెదిరిపోయిన స్వప్నాన్ని చేరేదాకా..!! -అనామిక
తనడిగింది.... నిశీధికంత నిశితమేంటని... పగలు నేర్చిన పాఠాలన్నీ.. రాత్రయ్యాక నిద్రపుచ్చని జోలపాటలయ్యాయేంటని... మరిక బదులేంచెప్పాలీ.. తప్పేమో అన్న ప్రశ్న కి అనుభవమే సమాధానమయ్యాక..!! -అనామిక
You cant scrolling this without like, 1/- for one like.. Type amen to save child... లాంటి పోస్ట్ ల వెనక క్యు కట్టే వాడు కూడా.. జనగణమన కి నుంచుంటేనే దేశభక్తా అని అడుగుతాడు... లైకులకి కామెంట్లకి బతికేసే ప్రాణాలున్నపుడు... నుంచుంటే మురిసిపోయే దేశమాత ఉండదా అని అడగాలనిపిస్తుంది.. _అనామిక
ఉదయాలెంత బాగుంటయో... రేరాజు వీడ్కోలు పలకలేక.... మేఘాలతో నిశ్శబ్ధ గీతాలాలపిస్తుంటే... చెలికాడిని వీడలేక... మబ్బులన్ని తమలో కలిపేసుకుంటుంటే.... సూరీడొచ్చేస్తుంటాడు.. చీకటి తాలూకు స్నేహాన్ని తన వెలుగుతూ కప్పేస్తూ... రేయంతా మెరిసిన తారలకి విరామాన్నిచ్చేస్తుంటాడు... పగలుని పరిగెత్తించ్చేస్తాడు... ఈరోజు నీదన్న కొత్త ఆశనొకదాన్ని నూరిపోస్తూ... రేయి...పగలు... ఒకదాని వెంటొకటి... ఒకదాని కోసమొకటి... తరాలు గడిచినా యుగాలు మారినా... చెక్కు చెదరని స్నేహమది... అంబరం లో దాగిన అనుబంధమది...!!! _అనామిక
ఆశలన్నీ గుర్తొస్తున్నాయి.. అడియాసలయ్యాక... జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి.. బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక.. -అనామిక 
Image
ఏంటో నువ్వు.. విరిగిపోయిన ఆకాశాన్ని మబ్బులతో కప్పిపుచ్చాలనుకుంటావు.. చెదరిపోయిన మనసుని మాటల దారాలేసి కట్టెయ్యాలనుకుంటావు.. దగ్గరైన భూమ్యాకాశాలంత అద్భుతాలవి.. కాని ఎప్పటికీ దరికి చేరని వాస్తవాలవి.. -అనామిక

ఆశ

చావే లేని ఆశ.. చంపడానికొచ్చిన నిరాశని చంపేస్తుంది..!! సూర్యోదయానికి నిలువెత్తు ప్రతిరూపం ఆశ.. ఎన్ని అస్తమయాలొచ్చినా అలుపే రాని శ్వాస..!! మనసు గదికి సంకెళ్లు లేని బందీ ఆశ.. నిరంతరం ధైర్యాన్ని తోడిపోసే వృత్తి లో జీవిత ఖైదు..!! ఊపిరాగేదాకా ఊసుపోనిది ఆశకొక్కదానికే.. ఊడిపడ్డప్పుడల్లా ఊరడించి ఊపందిస్తుంది....!! ఆశలన్ని కట్ట కట్టుకుని ఆశయాలైపోయాయి.. ఆవిరైపోయిన జీవితాల్లో వెలుగు నింపాలని..!! ప్రతి కలానికీ ఓ ఆశ.. తన యజమాని ఊహలన్నిటికీ పురుడు పోయాలని..!! -అనామిక

స్నేహం

స్నేహం లేని ప్రేమ మొదలవుతుందేమో గానీ.. ప్రేమ లేని స్నేహం మాత్రం ఉండదు.. దేన్నైనా మనసుతో పంచుకునే ఇద్దరు వ్యక్తుల బంధం స్నేహం.. మనసునే పంచుకునే రెండు ఆత్మల అపురూప కావ్యం ప్రేమ..!! -అనామిక 
ఏదైనా కోరుకో... ఏమైనా శాసించుకో.. ప్రేమని తప్ప.. అది కలగాలే తప్ప.. కలిగించబడకూడదు.! -అనామిక 
రణం ఎప్పటికైనా శరణం అంటూ ముగుస్తుంది.. అణచివేత ఎప్పటికైన రణాన్నే శరణంటుంది.. -అనామిక 
ఏ నిశిరాతిరి శబ్దానివో.. గుండె లయ కి శృతి కలుపుతుంటావు.. ఏ స్మృతి గీత మౌనానివో.. మదికో కొత్త భాష నేర్పిస్తుంటావు.. ఏ పరుష భావాధిపతివో.. దరి చేరలేక దూరం చేస్తుంటావు..!! -అనామిక 
ఆశలన్నీ గుర్తొస్తున్నాయి.. అడియాసలయ్యాక... జ్ఞాపకాలు సంకెళ్లవుతున్నాయి.. బంధాలు ముందరి కాళ్లకి కళ్లేలయ్యాక.. -అనామిక 

నీ రూపం

అంకెలు మారే తేదీలని చూస్తే.. అదోలాంటి దిగులు... రోజులు గడుస్తున్నా నీ రూపం దరిచేరదేంటని.. -అనామిక 

చిరునవ్వు

ఊహలన్ని కట్టకట్టి రూపమల్లె పురుడు పోసి.. ఊసులన్నీ మోసుకొచ్చి పసిపాపలా పంచుకోనా..!! అల్లరంతా పోగుచేసి చిరునవ్వులాగా మార్చివేసి తుంటరైన వయసుతోటి.. కొంటెగా సడిచేయనా నీ జంటలోనా..!! -అనామిక 

శ్రద్ధ

వసంతమొచ్చినా నీ మనసుకున్న కళంకం పోనట్లు ముహూర్తమేదైనా శ్రద్ధ లేని పని సత్ఫలితలనివ్వదు... -అనామిక

ప్రేమ

కాలం కదిలిపోదు కలకాలం నువు నా జంటైతే... కలం నన్ను వీడిపోదు నీ ఊసులన్నీ నా అక్షరాలవుతుంటే...!! -అనామిక